తెలంగాణ / లిబర్టీ న్యూస్ : రైతుల శ్రేయస్సే ధ్యేయంగా నిత్యం విధులు నిర్వర్తిస్తానని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ కో-ఆపరేటివ్ అధ్యక్షులుగా ఉన్న కొత్వాల డీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికవ్వడాన్ని హర్షిస్తూ సొసైటీ పాలకవర్గం ఆయనను ఘనంగా సన్మానించింది. మంగళవారం పాల్వంచ సొసైటీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ తోపాటు డైరెక్టర్లు, సిబ్బంది కొత్వాలను పూలమాలలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా సొసైటీ అధ్యక్షునిగా నిత్యం రైతులకు అందుబాటులో వుంటున్నానన్నారు. పాల్వంచ సొసైటీని తెలంగాణ రాష్ట్రంలోనే ద్వితీయ ఉత్తమ సొసైటీ గా తీర్చిదిద్దనన్నారు. ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యానన్నారు. తనకు పాల్వంచ సొసైటీ పాలకవర్గం, సిబ్బంది, రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, వారికీ జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కొత్వాల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, డిసిసిబి మేనేజర్ ఎ.స్వప్న, సూపర్వైజర్ వనమా సురేష్ కుమార్, డైరెక్టర్లు బుడగం రామమోహన్ రావు, కనగాల నారాయణ రావు, చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి మధు, నిమ్మల సువర్ణ, బర్ల వెంకటరమణ, భూక్యా కిషన్, సీఈవో జి.లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, లక్ష్మి, శోభారాణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.