తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాలోత్ వీరు ( వీరన్న) కు అతని సోదరుడు మాలోత్ భావ్ సింగ్ కు 4 కుంటల ఇంటి స్థలం విషయంలో గతంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3 మంగళవారం రాత్రి సుమారు రెండు గంటల సమయంలో భావ్ సింగ్ వీరన్న ఇంట్లోకి ప్రవేశించి, గొడ్డలితో కిటికీ అద్దాలు పగలగొట్టాడని, చంపుతానని బెదిరించి, ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడని వీరన్న వాపోయాడు. దీంతో భయభ్రాంతులకు గురైన మాలోత్ వీరన్న డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. తన తమ్ముడు మాలోత్ భావ్ సింగ్ తో తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీరన్న వేడుకుంటున్నాడు.