Tuesday, 10 December 2024 05:57:31 PM
# దొప్పలపూడి కి శుభాకాంక్షల వెల్లువ # పాల్వంచ - కుంటినాగులగూడెంలో భారీగా ఇసుక నిల్వలు # మున్నూరు కాపులకు అండగా ఉంటాం : కాంపెల్లి # అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడి అన్నదానం # తాళ్లూరి హరి బాబుకు అవార్డు # గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం # సమస్య పరిష్కరించకుంటే... ఉద్యమిస్తాం... # పాల్వంచ లో యాష్ కాంట్రాక్టర్ల నిరసన దీక్షలు # పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు # ACB వలలో చిక్కిన పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు # ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు # రూ.17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు : డాక్టర్ బిందు పల్లవి # కాంపెల్లి కిరణం # పాల్వంచలో డాక్టర్ కామ కిషోరం # ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని # రోడ్డు ప్రమాదంలో డి.ఏ.వి స్కూల్ విద్యార్థి మృతి # పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్...

శభాష్ డాక్టర్ పోటు వినోద్

Date : 28 August 2024 06:59 PM Views : 1253

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వహించే కొంతమంది వైద్యులు పని సమయం చూసుకుంటూ వైద్యం చేస్తుంటారు. కానీ కొంతమంది వైద్యులు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుంటారు. అదే కోవకు చెందినవారు డాక్టర్ పోటు వినోద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డెంటల్ యూనిట్ ఇటీవల ఓ ఆదివాసీ గిరిజనుడికి దంత వైద్య నిపుణులు పోటు వినోద్ ఖరీదైన ఆపరేషన్ చేశారు. లక్ష్మీదేవీపల్లి మండలం గట్టుమళ్లకు చెందిన కుంజా కన్నారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతనికి పై, క్రింది దవడలు విరిగి పోయాయి. గట్టుమళ్లకు చెందిన ఇండోస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ నరేందర్ మల్కాజిగిరి ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న దంత వైద్యుడు పోటు వినోద్ కు  ఫోన్ ద్వారా పరిస్థితి వివరించారు. డాక్టర్ వినోద్ గతంలో జూలూరుపాడులో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో మల్కాజిగిరి నుంచి వచ్చి శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు శ్రమించి పై దవడలకు స్టీల్ ప్లేట్లు అమర్చారు. ఇదే చికిత్స కార్పొరేట్ ఆస్పత్రిలో చేస్తే సుమారు రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ వినోద్  తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్వ కలెక్టర్ రజత్ కుమార్ శైనీ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని జూలూరుపాడు డెంటల్ యూనిట్ లో  మిషనరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని, అందుకే ఇక్కడికి వచ్చి వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పోటు వినోద్ మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :