తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నర్సిరెడ్డి గత నెల రోజుల నుండి మోకాలికి చీము పట్టి తీవ్ర నొప్పితో బాధపడుతూ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇటీవల పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శైలేష్ ను సంప్రదించగా ఆపరేషన్ చేయాలని తెలిపారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బుధవారం మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ సోమరాజు దొర, సిబ్బంది అభినందనలు తెలిపారు.