తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి- లోతువాగు సమీపంలో సోమవారం రాత్రి దారిదోపిడి చోటుచేసుకుంది. టేకులపల్లి కి చెందిన వాసాల తిరుపతి కారులో వస్తుండగా మార్గమధ్యంలో నలుగురు వ్యక్తులు దండం పెట్టి కారు ఆపారు. మానవత దృక్పథంతో కారు ఆపగానే తిరుపతి కళ్ళల్లో కారం కొట్టారు. కారు తాళాలు తీసుకొని బంగారం, మొబైల్ నగదు తో ఉడాయించారు. మొత్తం వీటి విలువ 1లక్షా 49వేలు ఉంటుందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.