తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బాణాల రాము ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేయటంతో శ్రావణి కేసు వాదిస్తున్న పాల్వంచ కు చెందిన లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్సై ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం అందించాలని ఎసిబి డిఎస్పి రమేష్ తెలిపారు. కాగా ఏసీబీ అధికారులు ఒక ఎస్ఐ స్థాయి అధికారిని పట్టుకోవడం పాల్వంచ పట్టణంలో చర్చనీయాంశమైంది.