తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మైనారిటీ మంత్రిత్వ శాఖకు కేవలం 574 కోట్లు కేటాయించి మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం చేసారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యండీ.యాకూబ్ పాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మైనారిటీలను ఆర్థికంగా, విద్యాపరంగా తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో 2023లో మైనారిటీ ఉపకార వేతనాలను రద్దు చేయటంతో పాటు మౌలానా ఆజాద్ ఫెలోషిప్ ను కూడా రద్దు చేయటం జరిగిందని అన్నారు. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా అమలుకు నోచుకోలేదని అన్నారు.