తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కిన్నెరసాని వరదలతో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పాల్వంచ మండల పరిధిలోని దంతెలబోరు, సంగం తదితర వరద ముంపు ప్రాంతాలలో అధికార యంత్రాంగం తో కలిసి కూనంనేని పర్యటించారు. జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధిత రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం తక్షణమే వరదల వల్ల వచ్చిన నష్టాన్ని తక్షణమే అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు పరిహారం, పక్కా గృహాల మంజూరికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కిన్నెరసాని ముర్రేడు వాగు వరదల్లో చిక్కుకున్న పశువుల కాపరులలో మిగిలిన ఒక్క వక్తిని రక్షించేందుకు డి.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి వరద ముప్పు వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చూపించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. కరకట్టల నిర్మాణానికి అంచనాలు వేసి తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతికుటుంబాన్ని, రైతులను, ఇసుక మేట వేసి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఇండ్లుకోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాధం, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి, సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డి.సుధాకర్, పాల్వంచ తహశీల్దార్ వివేక్, ఎంపిడీవో కె.విజయభాస్కర్, DE.PR. రామకృష్ణ, ఎంపీవో బి.నారాయణ, ఇరిగేషన్ శాఖ ఏ.ఈ మంగు, వ్యవసాయ అధికారి శంభోశంకర్, డాక్టర్ రాజు, రూరల్ ఎస్సై సురేష్, వివిధ శాఖల అధికారులు, సీపీఐ నాయకులు ముత్యాల కిరణ్ కుమార్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, వైస్ గిరి, ఉప్పుశెట్టి రాకేష్, ఎరుకుల వెంకటేశ్వర్లు, లాల్ పాషా, మాజీ సర్పంచులు బాదావత్ శ్రీను, భూక్య విజయ్, మాలోత్ హరి, మాజీ ఎంపీటీసీ బానోత్ రంజిత్, సుంకర రంగారావు, సపవత్ వెంకటరమణ, వేములపల్లి రాజశేఖర్, రవీందర్, ఆదినారాయణ, జర్పుల మోహన్, చంచల్పురి శీను, సాయిలు శీను, ప్రేమ్ కుమార్, బాదావత్ శ్రీనివాస్, వెల్లంకి శివరావు, అంచా శ్రీనివాసరావు, సత్యనారాయణ రాజు, అండగా పురుషోత్తం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.