తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన జలసూత్రం రవి - పావని దంపతుల కుమార్తె జలసూత్రం దక్షిత లండన్ లో చదువుతుంది. ఇటీవల సెలవుల నేపథ్యంలో పాల్వంచ వచ్చిన దక్షిత తన నాట్య గురువు రమాదేవి ఆధ్వర్యంలో శిక్షణ పొంది, పాత పాల్వంచ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి ముగింపు వేడుకలలో దక్షిత నాట్యం చేసి పలువురిని ఆకట్టుకుంది. విదేశాలలో చదువుకుంటున్నా కానీ, మన సంస్కృతి, సాంప్రదాయాల మీద మక్కువతో నాట్యంలో రాణిస్తుంది. ఈ సందర్భంగా దక్షిత తల్లిదండ్రులు జలసూత్రం రవి-పావని మాట్లాడుతూ తమ చిన్నారి చిన్నప్పటినుండి నాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించిందని, భవిష్యత్తులో మంచి నాట్య మయూరి అవ్వాలని ఆకాంక్షించారు.