తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా పాండురంగాపురం మాజీ సర్పంచ్ బొబ్బాల జీవన్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ రామసహాయం రఘురామిరెడ్డి గెలుపు కొరకు శ్రమిస్తామని తెలిపారు.