Sunday, 15 September 2024 10:34:07 PM
# పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..??

పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని

Date : 10 June 2024 08:33 PM Views : 291

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషి ఫలించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎర్ర సూర్యుని ఆధ్వర్యంలో నెరవేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి, శాఖ రాష్ట్ర అధికారులపై ఎమ్మెల్యే కూనంనేని ఒత్తిడి చేయటంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి 5 యూనిట్లతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో 5 డయాలసిస్ మిషన్స్ మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండటంతో, సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కూనంనేని గత మర్చి నెలలో లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం పాల్వంచ ఆస్పత్రికి 5 మిషన్లు మంజూరు చేసింది. త్వరలో వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో రోగికి ఒక్కసారి డయాలసిస్ నిర్వహిస్తే సుమారు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వెచ్చించాల్సిన పరిస్థితిని అధిగమించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో నిరుపేదలైన డయాలసిస్ రోగులకు ఊరట లభించినట్లైది. తన విజ్ఞప్తి, లేఖలపై స్పందించి 5 మిషన్లు మంజూరు చేయడంపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆస్పత్రికి మరో 5 యూనిట్లు మంజూరు కోసం ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నట్లు, త్వరలో అదనపు యూనిట్లు మంజూరు అవుతాయని తెలిపారు. పేద వర్గాలకు వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి  సారించినట్లు కూనంనేని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :