Sunday, 16 June 2024 04:19:24 AM
# పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని # మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు # పాల్వంచలో చలివేంద్రాలు ప్రారంభించిన కమిషనర్ అజ్మీర స్వామి # ఇసుక నిల్వలు అక్రమమా.. సక్రమమా..? # మార్చి 28న పాల్వంచలో సౌందర్యలహరి సహస్ర గళార్చన # డా. బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో సౌందర్యలహరి సహస్ర గళార్చన # మార్చి 8న పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం # మున్నూరు కాపులకు అండగా ఉంటా: కాంపెల్లి కనకేష్ # పాల్వంచలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..??

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే కూనంనేని

Date : 02 March 2024 07:31 PM Views : 201

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : అత్యంత వేగవంతంగా కొత్తగూడెం నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం పాల్వంచ మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన చంద్రాలగూడెం, రేగులగూడెం, మల్లారం, ఉల్వనూర్, సత్యనారాయణపురం, యానంబైల్, ప్రభాత్ నగర్, ఇల్లందులపాడు తండా, సూరారం, సోమలగూడెంలో 45 లక్షల రూపాయల ఎన్ఆర్జిఎస్ విధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అనతికాలంలోనే పల్లె పల్లెకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు. తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ఏజెన్సీ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించేంతవరకు విశ్రమించనని హామీ ఇచ్చారు. పదికాలాలపాటు అభివృద్ధి పనులు నిలిచి ఉండేలా చేపట్టాలని, నిర్మాణాల్లో ఎలాంటి నాణ్యత లోపించినా ఉపేక్షించేదిలేదని అధికారులు తరచుగా పనులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో రోడ్లు, డ్రైనేజిలు, కల్వర్టులు, ఇతర అభివృద్ధి నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల మౌలిక అవసరాలైన రోడ్లు, డ్రైనేజీలు, త్రాగు నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గతం కంటే మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి సాదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి, వార్డుకు కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాష, జెడ్పీటీసీ బరపటి వాసు, తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో, పంచాయతీ రాజ్ డిఈ, సిడిపిఓ, రూరల్ ఎస్సై, సిపిఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, చినగారపు శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, కొత్త సురేష్, వైయస్ గిరి, ఎస్కే. పాషా, యు.హరీష్, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, ఎర్రంశెట్టి ముత్తయ్య, కొండం వెంకన్న, కొత్తపల్లి సోమయ్య, పైడిపల్లి దుర్గమహేష్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, విద్యుత్ శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :