తెలంగాణ / లిబర్టీ న్యూస్ : విజయవాడ బుక్ ఫెస్టివల్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కు చెందిన కార్టూనిస్ట్ షేక్ సుభాని ప్రత్యేక జ్యురి బహుమతి అందుకున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా విశాఖ కార్టూనిస్ట్ ఫోరమ్ కార్టూన్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 70 మంది కార్టూనిస్ట్ లు పాల్గొనగా ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి సుభాని గీసిన కార్టూన్ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విశాఖ కార్టూనిస్ట్ ఫోరమ్ సభ్యులు లాల్, టి.ఆర్.బాబు, రామశర్మ, ప్రముఖ కార్టూనిస్ట్ లు సరసి, బాచి, నాగిశెట్టి, మహిళ కార్టూనిస్ట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.