తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను కాంపెల్లి రియల్ ఎస్టేట్స్ & బిల్డర్స్ అధినేత, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ పటేల్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొన్నారు.