తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతానని అల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా చందు నాయక్ అన్నారు. బుధవారం పాల్వంచలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నూతనంగా జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా సంఘ నాయకులు చందు నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. రద్దయిన జీవో స్థానంలో గిరిజనుల కోసం మరొక జీవోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే గిరిజనులతో భర్తీ చేయాలని, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ కింద పోడు భూములకు పట్టాదారులు పాసుపుస్తకాలు అందించి, వారికి రైతు బంధు/రైతుభరోసా వంటి పథకాలు వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు భద్రు నాయక్, జగదాంబ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు నాయక్, యువసేన జిల్లా అధ్యక్షులు భరత్, విద్యార్థి విభాగం నాయకులు రాములు నాయక్, సేవాలాల్ సేన నాయకులు పరమేష్ నాయక్, సుజాత, శృతి, వెంకన్న, సభావాత్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.