తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పాల్వంచ పట్టణ పరిధిలో ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు ఆడమ్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన క్రీడా పోటీలో పాండురంగాపురం మాస్టర్ మైండ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచిరి పాఠశాల గౌరవాన్ని తెచ్చిపెట్టారు. వివిధ భాగాల్లో పాల్గొన్న పాఠశాలల విద్యార్థులు మొత్తం ఈవెంట్స్ 15 బహుమతులు 50 సాధించి హౌరా అనిపించారు. నిమ్మకాయ చెంచా, సాకు జంప్, పరుగు పందెం, మ్యూజికల్ చైర్ ఫ్రాగ్ జంప్ వంటి వ్యక్తిగత పోటీలతో పాటు జూనియర్ కబడ్డీ కోకో వంటి జట్టు విభాగాల్లోనూ తమ ప్రతిభను చాటారు. ఫ్రాగ్ జంప్ లో మొదటి స్థానం, మ్యూజికల్ చైర్ లో మొదటి స్థానం, స్పూన్ అండ్ లెమన్ మొదటి స్థానం విజేతలగా నిలిచారు. జూనియర్ కోకో బాయ్స్ విభాగం నుండి మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. జూనియర్ విభాగం గర్ల్స్ కోకోనుండి ద్వితీయ స్థానం సాధించారు. విజయోత్సవం పాఠశాలకు పేరు ప్రతిష్టలను పెంచాయి. ఈ విజయాలతో మాస్టర్ మైండ్ పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలోని తమ ప్రతిభను చాటటమే కాకుండా పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. పాఠశాల కరస్పాండెంట్ జి.రాజు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.