తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల జరిగిన పాల్వంచ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో నవభారత్ సుమ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థి కుష్వంత్ నాయక్ ప్రతిభ కనబరిచాడు. సుమా విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ... విద్యార్థులు చదువుతోపాటు, క్రీడా లపై ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు.