తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పాల్వంచ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆటల పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్, అల్ కౌసర్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, స్వాతి స్కూల్, విజ్ఞాన్ స్కూల్, ఇందిరా ప్రియదర్శని స్కూల్, సిద్ధార్థ స్కూల్, సుమ విద్యానికేతన్ స్కూల్, హరిత స్కూల్, ఎయిమ్స్ లీడ్స్ స్కూల్, త్రివేణి స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లు ఎం. కృష్ణ, ఎస్.కే. సొందు, ముర్తుజ ఆలీ ఖాన్, జి.రాజు, సుమ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, బండి లక్ష్మణ్, జమీర్, నాగభూషణం, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.