తెలంగాణ / లిబర్టీ న్యూస్ : "అన్ని దానాల కంటే అన్నదానం మిన్న" అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని చాటుతూ... గురు పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ శ్రీ సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు - బేబీ సరోజిని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్ – శ్రీలత దంపతులు శ్రీ సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, "అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మహా పుణ్యకార్యం అని, గురువుల ఆశీస్సులు ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని తెలిపారు.అనంతరం పాత పాల్వంచ ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల వీరభద్రం, ముత్యాల రమణ మూర్తి , 47వ డివిజన్ BRS పార్టీ ఇంచార్జ్ మిరియాల అలివేలు , బట్టు మంజుల,ఏనుగుల శ్రీను , యాదయ్య,RMP శ్రీను , సిద్దు, ముదిగొండ శ్రీను, పిల్లల గంగాధర్,రాము,శివరాత్రి వినయ్,తదితరులు పాల్గొన్నారు.