తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇటీవల ప్రకటించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి నూనావత్ యశ్వంత్, అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, ప్రతిష్టాత్మకమైన నవోదయ స్కూల్, కరకగూడెం 5వ తరగతి లో సీటు సంపాదించినట్లు కరస్పాండెంట్ జి.రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మూర్తి విద్యార్థిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు కూడా క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి తో ప్రయత్నిస్తే ఎంతటి ఘన విజయన్నైనా సాధించవచ్చునని, ఈ ఘనత పాఠశాల ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తుందని, మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం కరస్పాండెంట్ విద్యార్థిని ఘనంగా సన్మానించి అధ్యాపకులను అభినందించారు.