Friday, 23 October 2026 12:43:26 AM
# పెద్దమ్మతల్లి ఆలయం వద్ద రావి, వేప చెట్లను పునఃప్రతిష్టించిన ముక్తేవి గిరీష్ - హర్షిని దంపతులు # పాల్వంచలో ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు # చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ # గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్

పెద్దమ్మతల్లి ఆలయం వద్ద రావి, వేప చెట్లను పునఃప్రతిష్టించిన ముక్తేవి గిరీష్ - హర్షిని దంపతులు

Date : 08 October 2026 07:44 PM Views : 373

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం–జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతన రావి, వేప చెట్లను పునఃప్రతిష్ఠించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ పరిసరాల్లో ఉన్న పురాతన రావి, వేప చెట్లు నేలకొరిగాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఈ చెట్లతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ముక్తేవి గిరీష్–హర్షిని దంపతుల సహకారంతో రాజమండ్రి జిల్లా కడియం నర్సరీ నుంచి సుమారు 14 సంవత్సరాల వయస్సు కలిగిన నూతన రావి, వేప చెట్లను తీసుకువచ్చి గురువారం ఆలయ ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించారు. ప్రత్యేకంగా పెరిగిన వృక్షాలను ఎంపిక చేసి ఆలయ పరిసరాల్లో పూర్వం ఉన్న ప్రదేశాల్లోనే నూతనంగా నాటడం ద్వారా ఆలయ ప్రాంగణానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నూతనంగా ప్రతిష్ఠించిన రావి, వేప చెట్లకు పూజలు నిర్వహించి, పుష్పాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముక్తేవి గిరీష్–హర్షిని దంపతులు మాట్లాడుతూ... శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి రావి, వేప చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా పురాతన చెట్లు నేలకొరగడం బాధాకరంగా అనిపించిందన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో నూతన రావి, వేప చెట్లను పునఃప్రతిష్ఠించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చెట్లు భవిష్యత్ తరాలకు కూడా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందిస్తాయని అన్నారు. రావి, వేప చెట్లు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని, ఆలయ పరిసరాల్లో ఇటువంటి వృక్షాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన చెట్లను భక్తులు, ఆలయ నిర్వాహకులు, స్థానికులు సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎ. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: