తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి పాల్వంచకు వన్నె తెచ్చారు బాగం అపర్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని తాటిపల్లి విల్లాస్ కు చెందిన భాగం అపర్ణ వృత్తిరీత్యా గృహిణి, యోగా టీచర్. ఇటీవల మైసూర్ దత్త పీఠం వారు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కంఠస్థం చేసి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1న మైసూర్ దత్త పీఠంలో గీత జయంతి సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదగా గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన బాగం అపర్ణ ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.