తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఇటీవల అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. ములకలపల్లి మండలం, పూసుగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ స్వామి ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడ్డారు. గమనించిన తోటి అయ్యప్ప స్వాములు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మంగళవారం పాల్వంచ పట్టణ పరిధిలోని ఒడ్డుగూడెం కు చెందిన ఆదిమా ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షులు శీలం భద్రం ఆధ్వర్యంలో గుగులోత్ శంకర్ స్వామికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 11,000/-ఆర్థిక సహాయం అందించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శీలం వాసు స్వామి, శీలం పెద్ద రమేష్, శీలం అంజి బాబు, శీలం శ్రీనివాస్, మురళీకృష్ణ, రామకృష్ణ, సజ్జ మూర్తి స్వామి, సజ్జ బాలు, శీలం నాగేశ్వరరావు (Bcm) సజ్జ విజయ్, మద్దెల మురళి, శీలం సమ్మయ్య, షేక్ రసూల్, పురాణం దుర్గాప్రసాద్, గోపి బెన్నవరం తదితరులు పాల్గొన్నారు.