తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్, సుమ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి పి.శశిక ఇటీవల జరిగిన స్పోర్ట్స్ స్కూల్ జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ చూపించి, హనుమకొండ లోని స్పోర్ట్స్ స్కూల్ నందు ప్రవేశం పొందింది. శశిక ఎంపిక పట్ల పాఠశాల కరస్పాండెంట్ కె. రమాదేవి, డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, అత్యున్నతమైన క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందటం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.