తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికురాలు చెరుకూరి శివపార్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ పార్వతి మాట్లాడుతూ... దేవీ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ప్రజలందరికీ సకల సుఖాలు, సిరిసంపదలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారాంపట్నం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.