తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలోని రేగులగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వజ్జా బాబు గత మూడు రోజుల క్రితం గుండెపోటుతో మరణించినాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ శనివారం రేగులగూడెం గ్రామానికి వెళ్లి వజ్జా బాబు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె ఝాన్సీ, కుమారుడు రోహిత్, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి దశదిన కర్మలకు 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ వజ్జా బాబు మరణం పాల్వంచ మండల బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, పాత ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారని, పాల్వంచ మండలం బిఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవాడని అటువంటి వ్యక్తి మరణించడం పట్ల తీవ్ర దిగ్బంతికి గురయ్యానని, వజ్జా బాబు కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వజ్జా బాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పాల్వంచ బిఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, పోసారపు అరుణ్, తోట లోహిత్ సాయి, కూరెళ్ళి మురళీమోహన్, కొమ్మాలపాటి నిఖిల్, గజ్జల రితిక్, మరియు రేగులగూడెం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండగాని రమేష్, వజ్జా రామకృష్ణ, వజ్జా లక్ష్మయ్య, ఈసం రాంబాబు, వజ్జా నరసయ్య వజ్జా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.