తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని సూరారం గ్రామ శివారు నర్సమ్మతల్లి గుడి సమీపంలో మంగళవారం పేకాట స్థావరంపై జిల్లా టాస్ ఫోర్స్ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 33,900 నగదు, 7 సెల్ ఫోన్లు,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ, ఎస్సైలు జలకం ప్రవీణ్, సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.