తెలంగాణ / లిబర్టీ న్యూస్ : 13వ నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినo సందర్భంగా ఆగస్టు 28న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడల్లో భాగంగా పాల్వంచ న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థులు హాకీ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనపరచి తృతీయ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులమీదుగా పతకాలను తీసుకున్నారు. గెలుపొందిన విద్యార్థులను కేఎల్ఆర్ విద్యా సంస్థల అధినేత్రి కె.నాగమణి, పాఠశాల ప్రిన్సిపల్ బి.సుమతి, అధ్యాపక బృందం అభినందించారు.