Tuesday, 10 December 2024 04:21:05 PM
# దొప్పలపూడి కి శుభాకాంక్షల వెల్లువ # పాల్వంచ - కుంటినాగులగూడెంలో భారీగా ఇసుక నిల్వలు # మున్నూరు కాపులకు అండగా ఉంటాం : కాంపెల్లి # అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడి అన్నదానం # తాళ్లూరి హరి బాబుకు అవార్డు # గట్టికల్లులో మెగా రక్తదాన శిబిరం # సమస్య పరిష్కరించకుంటే... ఉద్యమిస్తాం... # పాల్వంచ లో యాష్ కాంట్రాక్టర్ల నిరసన దీక్షలు # పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు # ACB వలలో చిక్కిన పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు # ఈడీ దాడులు రాజకీయ కుట్ర : నూకల రంగారావు # రూ.17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు : డాక్టర్ బిందు పల్లవి # కాంపెల్లి కిరణం # పాల్వంచలో డాక్టర్ కామ కిషోరం # ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే కూనంనేని # రోడ్డు ప్రమాదంలో డి.ఏ.వి స్కూల్ విద్యార్థి మృతి # పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్...

ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ

Date : 09 January 2024 08:58 PM Views : 614

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ట్రాక్టర్ల యజమానులు ట్రక్కుల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను అంటించి వెనుక నుండి వచ్చే వాహనదారులకు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా జిల్లా పోలీసులు తీసుకునే చర్యలకు ప్రజలంతా సహకరించాలని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :