తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శనివారం సరదాగా ఈత కొట్టేందుకు పాల్వంచలోని కరకవాగు వద్దకు వచ్చారు. అజయ్ అనే యువకుడు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.