Tuesday, 28 July 2026 06:18:37 PM
# పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్

భరోసా కేంద్రంలో ఉద్యోగాలు : ఎస్పీ

Date : 20 January 2024 05:22 PM Views : 758

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మహిళా భరోసా కేంద్రానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మహిళా అభ్యర్థుల నియామకాల కొరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భరోసా సెంటర్ భద్రాద్రి కొత్తగూడెం నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్(01),సపోర్ట్ పర్సన్(02),లీగల్ సపోర్ట్ పర్సన్(01),మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం(01) పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కులు లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన భరోసా సెంటర్ కొరకు మహిళా ఉద్యోగులను భర్తీ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు 21.01.2024 నుండి 01.02.2024 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ ఉద్యోగ నియామకాలు ఒక సంవత్సరం కాల వ్యవధి కొరకు మాత్రమేనని,అనంతరం అదే కాల వ్యవధి ఆవశ్యకత, బడ్జెట్ ప్రకారం ప్రతి సంవత్సరం పొడిగించబడుతుందని అన్నారు. బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తగిన పత్రాలన్నింటిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఇన్ వార్డ్ సెక్షన్ లో అందించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ 01.02.2024 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ఇ.విజయ్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఏదైనా సమాచారం కొరకు షీటీమ్ ఎస్.ఐ రమాదేవిని 8712682131 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించగలరని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: