తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ అజ్మీరా స్వామి ఆదేశాల మేరకు పాల్వంచ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచలోని గోంగూర హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో నిల్వ ఉంచిన పలు రకాల ఆహార పదార్థాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని హెచ్చరిస్తూ 5వేల రూపాయల జరిమానా విధించారు. కాగా పాల్వంచలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీ పాయింట్లలో కూడా తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.