తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వికలాంగుల కాలనీ యూత్ సభ్యులకు బుధవారం న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సాలి భాస్కర్ క్రికెట్ టీం కి టీ షర్ట్స్ అందించారు. ఈ సందర్భంగా సాలి భాస్కర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకొని, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, యూత్ సభ్యులు పాల్గొన్నారు.