తెలంగాణ / లిబర్టీ న్యూస్ : స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ప్రముఖ వైద్యులు డాక్టర్ మందడపు ముక్కంటేశ్వర రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని అన్నారు. అనంతరం మెరుపు వేగంతో వార్తలను అందిస్తున్న లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను డాక్టర్ ముక్కంటేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో NH9న్యూస్ ఛానల్ ఎండి ముత్తినేని శ్రీనివాసరావు, జర్నలిస్టులు ముత్యాల శేఖర్, అడపాల వెంగళరావు పాల్గొన్నారు.