Sunday, 08 September 2024 06:39:52 AM
# రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి

ప్రజలు స్వేచ్ఛగా బ్రతకటానికి రాజ్యాంగం అవసరం : నూకల రంగారావు

Date : 26 January 2024 03:41 PM Views : 250

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యం.డి.మంజూర్, ఎల్.డి.యం కోఆర్డినేటర్ బద్ధి కిషోర్, కాంగ్రెస్ నాయకులు బి.ఎన్.చారి, ఇజ్జగాని రవి గౌడ్, బోశెట్టి సాంబయ్య, తాళ్లూరి సత్యనారాయణ, సమ్మెటి అప్పారావు, బొల్లం భాస్కర్, రాము నాయక్,కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చు మధు, మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రెడ్డి,స్వర్ణలత, ఆటో యూనియన్ నాయకులు రాము, గౌస్, జయరాజ్, సందీప్, మల్లిఖార్జున్, మున్నా,రాము తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :