తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పాల్వంచ సిడిపిఓ కనకదుర్గ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అభినందిస్తూ ప్రశంస పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.