తెలంగాణ / లిబర్టీ న్యూస్ : 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివాసీ రాష్ట్ర నాయకులు బాడిశ బిక్షం దొర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ గణతంత్ర దినోత్సవంను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు బాడిశ బిక్షం దొర, ఊకె ముత్తేశ్వర్ రావు, సోయం కృష్ణ కుమార్, కుంజ రవి, వట్టం నాగరాజు, ఒగ్గేల భద్రయ్య, తాల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు