తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని అల్లూరి సెంటర్ వద్ద సౌండ్ లైటింగ్ & డెకరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అధ్యక్షులు ఎండి. అన్వర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎండి.అన్వర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెచ్చెట్టి శ్రీనివాసరావు, కత్తి శ్రీను, సెక్రటరీ బికే. కస్నా నాయక్, కోశాధికారి నంది వీరభద్రం, అంబటి వెంకట్, కొట్టే రమేష్, కొట్టే రవి, శ్రీకాంత్, కత్తి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.