తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రాజ్యలక్ష్మి ప్రింటర్స్ వారి ఆధ్వర్యంలో గురువారం మల్టీకలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ & సి.టి.పి ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చావా కిషోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్టీకలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడకు వెళ్లాల్సిన పని లేకుండా పాల్వంచలోనే అత్యాధునిక మిషన్ ద్వారా ప్రింటింగ్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సమీప జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు.