Sunday, 15 September 2024 08:55:41 PM
# పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు # రైతులకు అండగా ఉంటా : MLA కూనంనేని # ఆపద్బాంధవుడు కాంపెల్లి కనకేష్ పటేల్ # అన్న ఇంట్లో తమ్ముడి హల్ చల్... # బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు # శభాష్ డాక్టర్ పోటు వినోద్ # నృత్యంలో రాణిస్తున్న జలసూత్రం దక్షిత # పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం # ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..??

భళా నాగముత్యం

Date : 28 February 2024 07:24 PM Views : 325

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్బంగా బందోబస్త్ నిమిత్తం వెళ్లిన కానిస్టేబుల్ నాగముత్యం అక్కడ ఆకస్మాత్తుగా గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సిఆర్పి చేసి ప్రాణాలను కాపాడాడు. సమయస్పూర్తితో వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాగముత్యంను బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు సేవలు అందించడంలో ముందుండే పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ వైద్య పరంగా కూడా కొన్ని ప్రాధమిక విషయాలను తెలుసుకుని ఉండాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు అధికారులు,సిబ్బంది సిఆర్పి విధానాన్ని తెలుసుకుని ఉండాలని, ఇందులో భాగంగా సిఆర్పి గురించి జిల్లాలోని పోలీస్ అధికారులు,సిబ్బందికి శిక్షణను అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తోటి వారి ప్రాణాలను కాపాడటంలో పోలీసులే కాకుండా సామాన్య ప్రజలు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ భాద్యతగా మెలగాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రధమచికిత్సకు సంభందించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :