Saturday, 27 July 2024 09:11:59 AM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

దళితుల భూమి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం..

Date : 01 March 2024 01:58 PM Views : 848

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని నెహ్రూనగర్ నివాసి సిఖా నరసింహులు కు చెందిన సర్వే నెం.802 లోని 1.26 కుంటల భూమి పై మల్లెల రవిచంద్ర అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రవేశించి అక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాడని దళిత సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం పాల్వంచ వజ్ర హోటల్ లో దళిత,బిసి,మైనారిటీ, వివిధ రాజకీయపార్టీల అధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిఖా నరసింహులు కు చెందిన  భూమిపైకి  అక్రమంగా చొరబడితే సహించేది లేదని హెచ్చరించారు. మల్లెల రవిచంద్ర ఆర్థిక బలం, రాజకీయ బలం తో దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అన్నారు. సర్వే నెంబర్ 802, 805 ల పై సర్వే చేయించి, భూమి ఎవరి పేరు మీద ఉన్నదో అధికారులు నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఖా కృష్ణ, సిఖా అరుణ, సిఖా భూషణం, కాల్వ భాస్కర్ రావు, కాల్వ ప్రకాష్ రావు, సీపీఐ నాయకులు బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :