తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పాల్వంచ ప్రజా నాయకులు మల్లెల రవిచంద్ర జోలికి వస్తే సహించేది లేదని ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ, అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిమందికి ఉపయోగపడే ప్రజా నాయకుడు మల్లెల రవిచంద్ర పై కావాలని కొంతమంది కుట్రపూరితంగా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా దురుద్దేశంతో తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని అన్నారు. పాల్వంచలోని సర్వే నంబర్ 802 లో 1.26 కుంటల భూమిని మల్లెల రవిచంద్ర ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సర్వే నెంబర్ 805 లోని భూమిని చట్టపరమైన అన్ని హక్కులతో మల్లెల రవిచంద్ర విక్రయించారని, భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు వచ్చేందుకు మల్లెల రవిచంద్ర సిద్ధంగా ఉన్నాడని, అతనిపై ఆరోపణలు చేస్తున్న వారు అఖిలపక్ష రాజకీయ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసుకొని చర్చకు రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేతంశేట్టి విజయ్, తేజావత్ సాధు నాయక్, బండి వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రాజశేఖర్, భూక్య బాలకృష్ణ, సీత, ఇమ్రాన్, పాష,బాల స్వామీ, బోల్లేపోగు రవి, నంబూరి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.