తెలంగాణ / లిబర్టీ న్యూస్ : హిందూ ధర్మస్థాపన కొరకు లోక కల్యాణార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మొట్ట మొదటి సారిగా కోలాటం కళాకారిణి, జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.బేర శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సమక్షంలో సౌందర్యలహరి సామూహిక సహస్ర గళార్చన పారాయణం మార్చి 28న పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర శ్రీ కనకదుర్గా ఏసి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 1గం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా సంఖ్యా శాస్త్ర నిపుణులు, సరస్వతీ ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ ధైవజ్ఞ శర్మ, కొండూరు పద్మావతి, తదితరులు పాల్గొంటారని తెలిపారు.