తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పూనుకుల గ్రామం వద్ద యాష్ పాండ్ కట్టపై సుమారు 70 లారీల ఇసుకను పాల్వంచ రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అనంతరం రెవిన్యూ అధికారులు ఇసుకకు సంబంధించిన పత్రాలు అడుగగా.. కాంట్రాక్టర్ వద్ద ఉన్నాయని యాష్ పాండ్ సిబ్బంది తెలిపారు. ఇసుకకు చెందిన బిల్లులను పాల్వంచ తహశీల్దార్ కార్యాలయానికి తీసుకురావాలని యాష్ పాండ్ సిబ్బంది కి సూచించారు. ఇసుక నిల్వలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోతే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. కాగా ఈ ఇసుక సమీప ప్రాంతాలైన కిన్నెరసాని వాగు, గుర్రాలకుంట, తిమ్మంపేట నుండి అక్రమంగా తీసుకువచ్చారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఇసుక నిలువలను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.