తెలంగాణ / లిబర్టీ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు చెందిన విద్యార్థులు హైదరాబాదులో ప్రభంజనం సృష్టించారు. పాల్వంచ శ్రీను మెడికల్ అధినేత మేదరమెట్ల శ్రీనివాసరావు, హిమబిందు దంపతుల కుమార్తెలు హైదరాబాద్ ప్రగతి నగర్ లోని ఆవిష్కర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బుధవారం విడుదల చేసిన ఫలితాలలో మేదరమెట్ల సహస్ర, మేదరమెట్ల సమన్వి ల కు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయి. వారిని కళాశాల యాజమాన్యం అభినందించి, సత్కరించారు.