తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి అని పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నాడు రాములోరి పండగను జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైందని అన్నారు. ఈ పండుగ పర్వదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.