తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు పాల్వంచ కిన్నెర ఏజెన్సీస్ వారు బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు అవతరించిన రోజు, సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని, అన్యోన్య దాంపత్యానికి సీతారాములు ఆదర్శనీయులని అన్నారు. సీతారాముల కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భద్రాద్రి సీతారామచంద్రులను కిన్నెర ఏజెన్సీస్ వారు ప్రార్థించారు.