తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్, సంధ్య దంపతుల కుమార్తె కిరణ్మయి ఆది నుండి చదువులో సరస్వతి పుత్రికగా రాణిస్తోంది. 1 నుండి 3వ తరగతి వరకు సిద్ధార్థ హై స్కూల్, 4 నుండి 10 వరకు రెజినా కార్మెల్ కాన్వెంట్ పాల్వంచలో విద్యనభ్యసించి 10/10 జీపీఏతో పాఠశాల టాపర్ గా ప్రశంసలందుకొంది. హైదరాబాద్ బాచుపల్లి లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించింది. బుధవారం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో 1000 మార్కుల కి 973 మార్కులు సాధించి, బైపీసీ విభాగంలో నేటి మేటిగా నిలిచింది. చదువే సర్వస్వంగా భావించి, ఆ దిశగా తన ఆకాంక్షకు చేరువ కావడమే లక్ష్యంగా కిరణ్మయి పడుతున్న తపనకు పాల్వంచ ప్రజలనుండి హర్షం వ్యక్తం అవుతుంది. కాంపెల్లి కనకేష్ భారత రాష్ట్ర సమితి లో కీలక నాయకునిగా, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులుగా, వ్యాపారవేత్తగా కొత్తగూడెం నియోజకవర్గంలో సుపరిచితులు. కనకేష్ కు ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లల చదువులే ముఖ్యమని భావించి, ఆ దిశగా వారిని చదువులో అత్యుత్తమంగా రాణించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.