తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు పాల్వంచ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, బస్ స్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ లలో శనివారం మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి చలివేoద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణ పరిధిలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ బారిన పడకుండా జాగ్రత్తలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కందుల రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.