Saturday, 27 July 2024 12:33:34 PM
# ఏసీబీ వలలో చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము # కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు అన్యాయం : యండీ.యాకూబ్ పాషా # ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే : ఎస్పీ రోహిత్ రాజు # సీతారాంపట్నం పాఠశాల అభివృద్ధికి బూరుగుపల్లి ప్రసాదరావు రూ.40 వేల వితరణ # భాగం విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన MLA కూనంనేని # దండం పెట్టారు... దోచుకెళ్లారు.. # కొత్తగూడెం నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు : ఎమ్మెల్యే కూనంనేని # పవర్ యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం # పట్టువదలని ఎమ్మెల్యే కూనంనేని # పాల్వంచలో నిబంధనలకు "తుక్కు" # శీలం సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం # వనమా ఇంటికి కేసీఆర్... నామాకు ఎఫెక్టేనా..?? # RRR (రామసహాయం రఘురామిరెడ్డి) ని కలిసిన జీవన్ రెడ్డి # హైదరాబాద్ లో విరిసిన పాల్వంచ కుసుమాలు # చదువులో వెలిగిన కాంపెల్లి కిరణ్మయి # నేను పోలీస్ ఇన్ ఫార్మర్ ని...!! # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కిన్నెర ఏజెన్సీస్ # శభాష్ సుభాని

మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Date : 14 April 2024 11:29 AM Views : 729

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ నందు శనివారం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి. రాజు మాట్లాడుతూ  గత 13 సంవత్సరాలుగా విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దటంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ ముందంజలో ఉందని తెలిపారు. తల్లిదండ్రుల ఆదరణ, సహకారం, ప్రోత్సాహంతో   13 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 14వ సంవత్సరంలోకి అడుగుడినట్లు తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు, అనాధ పిల్లలకు సాధ్యమైనంతవరకు ఉచిత విద్యాబోధన చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి రాజు ఆధ్వర్యంలో అతిధులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు ముర్తుజా ఆలీ ఖాన్, లీడ్ స్కూల్ డైరెక్టర్ రెంటాల నాగభూషణం, ఏ.డి.ఈ విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రెటరీ తిరుపతిరావు, ఉపాధ్యాయులు అశోక్, అన్వేష్, డాన్స్ మాస్టర్ శ్యామ్, నాగలక్ష్మి, సంధ్య, గీత రత్నమణి, విజయ, పద్మ, అనిత, గాయత్రి, శిరీష, కోటేశ్వరి, గ్రామ ప్రజలు,  సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2024. All right Reserved.

Developed By :